![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -730 లో..... కార్తీక్, సూరజ్ లని తీసుకొని దక్షిణామూర్తి ఇంటికి వెళ్తాడు శివన్నారాయణ. మాలిని పై నుంచి కిందకి వస్తుంది. వాళ్లని చూసి దక్షిణామూర్తి కూర్చోండి అని మర్యాద చేస్తాడు. నీ మర్యాద కోసం రాలేదని శివన్నారాయణ అంటాడు. అయిన వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకొని శివన్నారాయణ ధర్జాగా కూర్చుంటాడు. నా కూతురు ఇంటికి వెళ్లి పండ్లు, బ్లాంక్ చెక్ ఇచ్చావంట.. ఎందుకని శివన్నారాయణ కోప్పడతాడు. కాంచన నా చెల్లి లాంటిది తన పరిస్థితి చూసి జాలేసిందని మాలిని అంటుంది. అలా అని మీతో నా తల్లి చెప్పిందా అని కార్తీక్ అడుగుతాడు.
నా కూతురికి ఏం కావాలన్న చూసుకోవడానికి నేనున్నాను.. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి అని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చానని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ తన దగ్గరున్న రూపాయి కాయిన్ శివన్నారాయణకి ఇస్తాడు. మీరు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఇచ్చింది ఇవ్వడం అలవాటు లేదు. మీ చెక్ మీకు ఇచ్చి ఒక రూపాయి ఎక్కువిస్తున్నా.. అప్పుడు పై చెయ్ నాది అవుతుందని మాలినికి శివన్నారాయణ కౌంటర్ వేస్తాడు. ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావ్.. కార్తీక్ నీ మనవడు కాబట్టి తీసుకొని వచ్చావ్ .. అతను ఎవరు అని దక్షిణామూర్తి అంటాడు. ఇద్దరు నాకు మనవళ్లే.. వీళ్ళే నా ల్యాండ్ మార్క్.. వీళ్ళని దాటుకొని ఇద్దరున్నారు జ్యోత్స్న, దీప. వాళ్ళని దాటుకొని ఇద్దరున్నారు సుమిత్ర, కాంచన. వాళ్ళని దాటుకొని ఇద్దరున్నారు.. నా కొడుకు దశరత్, అల్లుడు శ్రీధర్ ఇది నా కుటుంబమని శివన్నారాయణ గర్వంగా చెప్పి వెళ్ళబోతు ఆగి వస్తాడు. వచ్చినప్పుడు ఏమైనా కావాలా అన్నారు కదా ఇంకొకసారి మాకు ఎదురు పడకండి అని శివన్నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
మరొకవైపు సుమిత్ర దగ్గరికి కాంచన వస్తుంది. నాన్న ఆ మాలిని ఇంటికి వెళ్ళాడు. ఫోన్ చేసి నన్ను ఇంటికి వెళ్లమని చెప్పాడు. అందుకే వచ్చానని కాంచన అంటుంది. అప్పుడే శివన్నారాయణ వాళ్ళు వచ్చి జరిగింది చెప్తాడు. అందుకే కాంచనని రమ్మన్నారా అని పారిజాతం అనగానే లేదు శ్రీధర్ వస్తున్నాడని చెప్పడానికి అని శివన్నారాయణ అంటాడు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు నేను అన్యాయం చేసానని ఆ మాలిని అంటుందన్నావ్.. నువ్వు అలా అనుకుంటున్నావా అని కాంచనని శివన్నారాయణ అడుగుతాడు. నువ్వు ఏమైనా అనుకుంటున్నావా తాతయ్య అని కార్తీక్ అనగానే అనుకుంటున్నానని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |